వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా... కోటిరెడ్డి

కోదాడ 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోల్లా కోటిరెడ్డి తన ఎన్నికల కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలంటే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ప్రథమ ప్రాధాన్యమని, హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్