నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ

కోదాడ పట్టణంలో పాత నేరస్తులు, గంజాయి కేసుల నిందితులు, సస్పెక్ట్ షీటర్లకు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని, లేదంటే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంచి ప్రవర్తన కలిగిన వారి షీట్లు ఎత్తివేయడంపై పరిశీలిస్తామని, అలవాటుగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జిల్లా బహిష్కరణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్