స్మార్ట్ పాఠశాలలో భారతదేశ కల్చరల్ ఫెస్టివల్

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రామ్మూర్తి నగర్ స్మార్ట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో భారతదేశ కల్చరల్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంప్రదాయాలు, వేషధారణలు, ముఖ్యమైన ప్రదేశాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు తమకు కేటాయించిన రాష్ట్రాల వేషధారణతో ఆయా రాష్ట్రాల సంస్కృతిని వివరిస్తూ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పండుగ ద్వారా జాతీయ ఐక్యత, సంస్కృతి పట్ల గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందినట్లు విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులు లహరి, మస్త్ర, సైనా, శిరీష, అరుణ, పుష్ప పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్