కోదాడ మున్సిపాలిటీ 34వ వార్డులోని ఎర్రకుంట వాగు కాలువ పూడికతీత పనులను చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు పరిశీలించారు. వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులను త్వరగా పూర్తి చేయాలని చైర్‌పర్సన్ ఆదేశించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ సురేష్, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.