కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై మద్దతు తెలిపారు. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన మరణానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మార్పీఎస్ డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.