కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కబడ్డీ లీగ్ ఫైనల్ పోటీలు

కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోదాడ నియోజకవర్గ స్థాయి కబడ్డీ లీగ్ పోటీలు రెండవ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కబడ్డీ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నామా నరసింహా రావు, రిటైర్డ్ పీడీ వెనేపల్లి శ్రీనివాస రావు, జాతీయ క్రీడాకారుడు శివ నాథ్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, అభిజ్ఞ లు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఫైనల్ అనంతరం బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడియాల సత్యనారాయణ రెడ్డి, కిరణ్ రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్