కోదాడలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత విమర్శలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో, ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న నేతలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని నాయకులు అన్నారు. సంబంధిత నాయకుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.