భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు కోదాడ తేజ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, తుమ్మా బ్లెస్సీ స్నేహిత రెడ్డి, రామినేని సహస్ర (7వ తరగతి) ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి, దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల్లో ఉత్తమ 200 మందిలో వీరు స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, డైరక్టర్ సోమి రెడ్డి విద్యార్థులను అభినందించారు.