సౌదీ అరేబియాలోని దమామ్ లో కోదాడకు చెందిన షేక్ తాజోద్దిన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చింది. తాజోద్దిన్ గత పది సంవత్సరాల క్రితం కారు డ్రైవర్ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాడు. ఇటీవల స్వంత వ్యాపారం పెట్టుకున్నాడని కుటుంబ సభ్యులు గురువారం పేర్కొన్నారు. ఈ క్రమంలోతాజోద్దిన్ మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.