కోదాడలో కర్ల రాజేష్ లాకప్ డెత్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సోంపంగి అఖిల్ డిమాండ్ చేశారు. రాజేష్‌పై చట్టవిరుద్ధంగా చిత్రహింసలు చేసిన చిలుకూరు ఎస్సై, కోదాడ రూరల్ సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. పిర్యాదు లేకుండానే రాజేష్‌ను అదుపులోకి తీసుకుని రోజులు తరబడి రెండు స్టేషన్లలో నిర్బంధించడం అమానుషమని, అమాయకుడైన రాజేష్‌పై లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని, బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అఖిల్ కోరారు.