కోదాడ: ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన

స్కూల్ బస్సు డ్రైవర్లు రహదారి భద్రత నియమాలు పాటించాలని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని అన్నారు. గురువారం కోదాడలో ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు రహదారి భద్రత నియమాలపై ఏర్పాటుచేసిన సదస్సులో మాట్లాడారు. కోదాడ పరిధిలో 220 ప్రైవేట్ పాఠశాలల కళాశాలల బస్సులు ఉన్నాయని వాటిలో 95 శాతం బస్సులు వాహన సామర్థ్య పరీక్షలు చేయించారన్నారు. స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం కలిగిన డ్రైవర్లను నియమించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్