కోదాడ: ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన

విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యత పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోదాడ ఎస్బిఐ మేనేజర్ వీరస్వామి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి బ్యాంకు ఖాతాను తెరవాలన్నారు. విద్యార్థులకు శూన్య ఖాతా అకౌంట్లను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాదేవి ఉపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్