కోదాడ: శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రం లో వేడుకలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడలోని అశోక్ నగర్ లో గల శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు శనగల జగన్మోహన్ దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 20 ఏళ్లుగా తమ సంస్థ అనాధ పిల్లలు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తూ ఆత్మస్థైర్యం నింపుతోందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్