కోదాడ పట్టణంలోని గాలి రమేష్ నాయుడు అన్నదాన సన్నిధానంలో సోమవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు కారుమంచి శ్రీనివాస్, మహేంద్ర షోరూం యజమాని జి. రాంబాబు కలిసి 500 మంది స్వాములకు అన్నదానం నిర్వహించారు. గాలి శ్రీనివాస్ నాయుడు అన్నదాన సన్నిధానం నిరంతరం అన్నదానాలను నిర్వహించడం అభినందనీయమని దాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీతా రామ్ సింగ్ పాల్గొన్నారు.