మంగళవారం కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రూరల్ ఎస్సై గోపాల్‌రెడ్డి పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రచారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే అనుమతించబడుతుందని, డీజేలు, ర్యాలీలకు అనుమతి లేదని, ఓటర్లను బెదిరిస్తే టీపోల్ యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ పాల్గొన్నారు.