కోదాడ: పాఠశాలలో యుడైస్ గణాంకాల పరిశీలన

అనంతగిరి మండలంలోని అనంతగిరి, అనంతగిరి బీసీ కాలనీ పాఠశాలల్లో బుధవారం నల్లగొండ డైట్ కళాశాల విద్యార్థులు పాఠశాలల యుడైస్ గణాంకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెల్లడించిన గణాంకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరన్న, రమేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్