రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తం అని చట్ట సభల్లో బిల్లు ఆమోదించటటం స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ తెలిపారు. శుక్రవారం కోదాడ లో ఏర్పాటుచేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజికంగా అభివృద్ధి చెందిన పంబాల, మన్నే కులాలను క్యాటగిరి ఏ నుంచి తొలగించి సీ కేటగిరీలో చేర్చాలని బలహీనులుగా ఉన్న బుడగజంగాలు, డక్కలి కులాలను ఏ క్యాటగిరిలోఉంచాలన్నారు.