కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సూర్యాపేటలో సౌత్ ఇండియా ఏషియన్ పెయింట్స్ ఐడియా స్టోర్ ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు కోదాడ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ, మధ్యాహ్నం 3 గంటలకు ఐటీఐ కాలేజ్/ఏటీసీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థల కేటాయింపుపై అధికారులతో సమావేశం, 3:30 గంటలకు ఆర్టీఏ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.