కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అర్వపల్లి హనుమంతరావు అధ్యక్షుడిగా, గడ్డం రాంబాబు ప్రధాన కార్యదర్శిగా, చాప గోవిందరావు ఉపాధ్యక్షుడిగా, ఓరుగంటి శ్రీనివాసరావు సహాయ కార్యదర్శిగా, సముద్రాల బద్రిష్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. అదే కార్యక్రమంలో గుమస్తాల సంఘం కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.