కోదాడ: ఎన్‌ఎస్‌ఎస్ ఎయిడ్స్ డే

కోదాడలోని కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రణబోతు పిచ్చిరెడ్డి, జీవాలజీ అధ్యాపకుడు షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అత్యంత ప్రమాదకరమని, దీనికి చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వేముల వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్