కోదాడలోని పెన్షనర్స్ భవనంలో శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలు జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య మాట్లాడుతూ, వృద్ధాప్యంలో సమస్యలకు దూరంగా ఉంటూ సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘు, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, ఉపాధ్యక్షులు గులాం ఎస్దాని, వరకాల జానయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి హాజీ నాయక్, బాలేమియా, బిక్షం పాల్గొన్నారు.