కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ బృందం కలిసి కర్ల రాజేష్ మృతి ఘటనపై వినతి పత్రం అందించారు. చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ ప్రతాప లింగం అకారణంగా రాజేష్ ను అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేయడంతోనే అతను మృతి చెందాడని బాధితులు ఆరోపించారు. వీరిపై హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని, బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స్పందించి, విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.