కోదాడ: కూరగాయల మార్కెట్ వెనుక కాలుష్యం

కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వెనుక చెత్త, చెదారం, వ్యర్థ పదార్థాలు కుప్పలు కుప్పలుగా వేయడం మూలంగా మార్కెట్ పరిసరాల్లో కాలుష్యం పెరిగిపోయిందని సామాజిక కార్యకర్త మజహార్ మంగళవారం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చెత్త, చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేయించాలని ఆయన కోరారు. చెత్త, చెదారంతో ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్