కోదాడ ఇండోర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీమన్నారాయణ కాలనీ 11 కె. వి ఫీడర్ కు అత్యవసర మరమ్మత్తుల కారణంగా, శనివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ నరసింహ తెలిపారు. శ్రీమన్నారాయణ కాలనీ, శ్రీనివాస నగర్, గణేష్ నగర్, శ్రీరంగాపురం, అలవాలపురం ప్రాంతాలలో ఈ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.