మునగాల మండలం రేపాల సబ్ స్టేషన్ లో నరసింహుల గూడెం ఫీడర్ మీద మరమ్మత్తుల కారణంగా రేపు ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వికాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు విద్యుత్ అంతరానికి సహకరించాలని కోరారు. మరమ్మతుల అనంతరం తిరిగి విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు.