కోదాడ: శ్రీకాంత చారి త్యాగం చిరస్మరణీయం.. రాయ పూడి

కోదాడలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని, ఉమ్మడి నల్గొండ జిల్లా మలి దశ ఉద్యమ కారుల సంఘం అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్