కోదాడ: శ్రీకాంతాచారి ఆశయాలు సాధించాలి

తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని మునగాలలోని బుధవారం బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ, శ్రీకాంతాచారి బలిదానంతోనే తెలంగాణ సాధించుకున్నామని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని, శ్రీకాంతాచారి విగ్రహాన్ని ట్యాంక్ బండుపై నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆకాంక్షతోనే శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్