కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్, ఉపాధ్యాయులు బుధవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. పాఠశాలలో వంట ఏజెన్సీ మహిళలు సార్వత్రిక సమ్మె కారణంగా విధులకు హాజరు కాలేదు. కాగా విద్యార్ధులు పస్తులు ఉండకుండా ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిఈవో ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులే మధ్యాహ్న భోజనం వంటావార్పు చేసి విద్యార్ధులకు అందించారు.