కోదాడకు చెందిన టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మంగమణి, కోదాడ పట్టణ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మల్లేశ్వరి, అడ్వకేట్ కొండల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు దావల్ కొండల్ శేఖర్, శోభన్ పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ రెడ్డి ఉన్నత పదవులు చేపట్టి, కలకాలం ఆరోగ్యంగా ఉండాలని అందరూ ఆకాంక్షించారు.