కోదాడ: వంగపల్లి పద్మకు తెలుగు వెలుగు సాహితీ వేదిక పురస్కారం

కోదాడ పరిథిలోని బాలాజీ నగర్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహ సంక్షేమ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వంగపల్లి పద్మకు భారతరత్న పీవీ నరసింహారావు తెలుగు వెలుగు సాహితీ వేదిక పురస్కారం వరించింది. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభ కళావేదికలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సాహితీ వేదిక వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పోలోజు రాజకుమార్ చార్యులు పురస్కారాన్ని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్