కోదాడ: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండలం బేతవోలు హైస్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు చందా శ్రీనివాసరావు అన్నారు. శనివారం గ్రామంలో బడిబాట నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత దుస్తులు, పుస్తకాలు, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాదే కోటేశ్వరరావు, శ్రీరామ్, వెంకటేశ్వర్లు, ప్రకాష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్