కోదాడ: కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటాం

కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శుక్రవారం మోతె మండలం హుస్సేనా బాద్ లో ఇటీవల మృతి చెందిన కందిమల్ల కౌసల్య, రెబ్బ కనకమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను పార్టీ పక్షాన ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్