కోదాడ: మామిడి తోటల రైతులను ఆదుకుంటాం

గాలి దుమారానికి నష్టపోయిన మామిడి తోటల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో పలు గ్రామాల్లో మామిడి తోటల్లో నేలరాలిన మామిడికాయలను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి అనిత, ఏ ఈ ఓ ప్రియాంక కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్