కోదాడ: బూడిదలో పడి మహిళ మృతి

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంకు చెందిన సాధినేని దుర్గ (46) అనే మహిళ హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో మరణించింది. హుజూర్నగర్ లోని ఓ పారు బాయిల్డ్ మిల్లులో బూడిద ఎగుమతి చేయడానికి కూలికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బూడిదలో పడి తీవ్ర గాయాలపాలైంది. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొంది, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.

సంబంధిత పోస్ట్