క్రికెట్ లో రాణించి రాష్ట్రంలో కోదాడ నియోజకవర్గానికి పేరు తేవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. శనివారం మోతె మండలం భీక్యా తండాలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడలను శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. క్రీడల నిర్వహణకు తన వంతు సహకారం అని వేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.