తెలంగాణ సాధన కోసం పోరాడిన త్యాగధనుడు కొండా

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాధన కోసం పోరాడిన త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సేవా సంఘం నాయకులు అన్నారు. ఆదివారం బాపూజీ 111వ జయంతి సందర్భంగా కోదాడ ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కొంగర నరసింహారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 400 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ, మలిదశ ఉద్యమంలో 96 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. చేనేత సహకార సంఘాలకు పునాది వేసిన ఆయనకు భారతరత్న ప్రకటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕