అంతర్జాతీయ కరాటే పోటీల్లో క్రాంతి సత్తా

కోదాడకు చెందిన ప్రముఖ కరాటే మాస్టర్, బ్లాక్ బెల్ట్ 5వ డాన్ కొండపల్లి క్రాంతి కుమార్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటారు. ముంబై అంధేరి (డబ్ల్యూ) స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏషియన్ షిటో-ర్యూ స్పోర్ట్స్ కరాటే-డో అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న నిర్వహించిన 9వ ఆసియా కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో అండర్-30 కాటా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. క్యోషి సంజయ్ గవాళ్లే చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో కరాటే అభివృద్ధి, యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕