విజయ గణపతి దేవాలయంలో రూ. 38 వేలు పలికిన లడ్డు

కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గణనాథునికి పూజలు, అభిషేకాలు నిర్వహించగా, స్వామివారి లడ్డూ వేలంపాట పోటీపోటీగా సాగింది. ఓరుగంటి నిఖిల్ రూ. 38 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓరుగంటి వెంకట బ్రహ్మం, ఓరుగంటి రాము, ఓరుగంటి నవీన్ కుమార్ అన్నదాతలుగా వ్యవహరించి అన్నప్రసాద వితరణ చేశారు. ఓరుగంటి నారాయణ, ధనలక్ష్మి జువెలర్స్ నిర్వాహకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕