మట్టి విగ్రహాలను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుకుందాం

కోదాడ టీచర్స్‌ కాలనీలో మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో రెండో వార్షిక గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్‌ తోట జ్యోతి శ్రీనివాస్, 20వ వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ జిల్లేపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మట్టి గణనాథుడిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు కోడుమూరి ప్రవీణ్, గౌరవ అధ్యక్షుడు చెన్నకేశవరావుతో పాటు కమిటీ సభ్యులను అభినందించి సన్మానించారు. మహిళలు, కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕