సివి రామన్ ను స్ఫూర్తిగా తీసుకొని శాస్త్రవేత్తలు గా ఎదగాలి

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కోదాడ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కుసుమా వెంకటరత్నం బాబు, మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్, 13వ వార్డు కౌన్సిలర్ ఎం గురువమ్మ సైదుబాబు యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులు సివి రామన్ స్ఫూర్తితో భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ పాఠశాల సమస్యలను మున్సిపాలిటీ ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్