కోదాడ లో చిరు జల్లులు...

కోదాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఉక్కపోత నెలకొనగా, సాయంత్రానికి ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుని చిరుజల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రత తగ్గి చల్లని వాతావరణం ఏర్పడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ మారిన వాతావరణాన్ని ఆస్వాదించారు. చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ కోదాడలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రైతులు, ప్రజలు మంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులకు విస్తారంగా వర్షాలు కురవాలని రైతులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్