అనంతగిరి మండలం శాంతినగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని మాదా ప్రణీత 600 మార్కులకు 562 సాధించి మండలంలోనే టాపర్‌గా నిలిచింది. లారీ డ్రైవర్ రామ కృష్ణ, వ్యవసాయ కూలీ ప్రవల్లికల కుమార్తె అయిన ప్రణీత లకారం గ్రామానికి చెందినది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం పురుషోత్తం మాట్లాడుతూ, మొత్తం 20 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, అందరూ ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.