అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ సేవలను కొనియాడుతూ, అహింస, సత్యాగ్రహ మార్గాల్లో స్వాతంత్ర్యం సాధించిన ఆయన ఆశయాలను యువత అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌమ్య, కొల్లు సుబ్బారావు పాల్గొన్నారు.