కుక్కలకు మేజర్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఒకే రోజు రెండు కుక్కలకు మేజర్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. మఠంపల్లి మండలం మంచ్యాతండకు చెందిన కుక్కకు తొంటి ఎముక, నూతనకల్ మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన మరో కుక్కకు భుజం ఎముక తీవ్రంగా దెబ్బతినడంతో, అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ఆధ్వర్యంలో రాడ్లు, ప్లేట్లు, సర్క్లేజ్ వైర్లతో ఎముకలను సరిచేసి శస్త్రచికిత్సలు చేశారు. చికిత్స అనంతరం కుక్కలు కోలుకోవడంతో యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డా. భూక్యా మధు, డా. కట్టెల శంకర్, సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్