నడిగూడెం మండలం వేణుగోపాలపుర గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ, పాలక వర్గాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.