మేడే ను జయప్రదం చేయాలి....... CITU

గురువారం కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లో సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎం. ముత్యాలు కార్మికులతో సమావేశం నిర్వహించి, మేడేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధించవచ్చని, ఇందుకోసం సీఐటీయూ కార్మికులతో కలిసి పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు సైదమ్మ, సుగుణమ్మ, మరియమ్మ, నాగమ్మ, చైతన్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్