నేరేడుచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాలోతుబాలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బట్టు మధులు మాట్లాడుతూ, హోలీ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని, వెలుగును నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ఆడిట్ కమిటీ వైస్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంతంగి సైదులు, దీప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.