కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు కోదాడ మున్సిపాలిటీ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలను ప్రతిబింబించే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సామాజిక న్యాయం, అభివృద్ధి, ప్రజాసేవలో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కోదాడకు మంచి భవిష్యత్తు రావాలని ఆకాంక్షించారు.