కోదాడలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో కార్మికుల దినోత్సవం మేడేను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు భావా సింగ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్. నాగేశ్వరరావు, పాండు రంగ చారిలు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ కమిటీ సభ్యులు జనార్ధన్, సీనియర్ నాయకులు చందా శ్రీనివాసరావు, పిడతల శ్రీనివాస్, ఉపేందర్, మరియు డివిజన్‌లోని అన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు.