స్కూల్ హౌస్ సిస్టం ప్రారంభించిన ఎంఇఓ

కోదాడలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ హౌస్ సిస్టం ఏర్పాటు చేశారు. మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని దుస్తులు పంపిణీ చేశారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, పాఠశాల నిర్వహణలో వారిని భాగస్వాములను చేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాల పెంపుదలపై దృష్టి సారించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్